చంటి ఛానల్,బోధన్: స్వామి వివేకానంద 164వ జయంతిని పురస్కరించుకుని సోమవారం బోధన్ పట్టణంలోని నర్సాపూర్‌లో యువత ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ క్రీడా పోటీలను బోధన్ టౌన్ ఎస్ఐ భాస్కర్ చారి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివేకానందుడి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని యువత క్రీడల్లో రాణించాలని, క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బానోత్ సాయికృష్ణ, ప్రవీణ్, గంగనర్సయ, ఇబ్రహీం, శంకర్, మల్లయ్య, రాకేష్‌లతో పాటు 4వ వార్డు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని టోర్నమెంట్‌ను విజయవంతం చేశారు.

