చంటి ఛానల్,బోధన్: అభివృద్ధి పనుల నిమిత్తం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు (మంగళవారం, 20.01.2026) విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ (TGNPDCL) ఏఈ నాయిని కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 01:30 గంటల వరకు షర్బతి కెనాల్, సరస్వతి నగర్, ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా, శివాలయం టెంపుల్ పరిసరాలు, పాత బస్టాండ్, మార్కెట్ రోడ్డు, అంబేద్కర్ చౌరస్తా, కోర్టు ఏరియా మరియు విశ్వేశ్వరయ్య పార్క్ కాలనీల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. పనుల దృష్ట్యా వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

