చంటి ఛానల్,బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని చెక్కి తలాబ్ వద్ద గురువారం సాయంత్రం శ్రీ సాయి ప్రసన్న హైస్కూల్‌కు చెందిన పాఠశాల బస్సు ప్రమాదానికి గురైనప్పటికీ, విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న చిన్నారులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు తక్షణమే స్పందించి పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. తమ పిల్లలు క్షేమంగా ఉన్నారని తెలుసుకున్న తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

