చంటి ఛానల్,బోధన్: బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వర శివాలయంలో 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శైవ సంప్రదాయానుసారంగా భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గణేష్ శర్మ, సంతోష్ శర్మ,,మహేష్, శివ కుమార్ ఆధ్వర్యంలో స్వామివారికి లఘున్యాస రుద్రాభిషేకం, బిల్వార్చన, రుద్ర హోమం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో నాయకం రాములు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ బీర్కూర్ శంకర్, లక్ష్మణ్ రావు పటేల్, మోత్కూరి సాయిలు, శివదీక్ష స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వేడుకల అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

