సంక్రాంతి ప్రయాణికులకు నిజామాబాద్ పోలీసుల కీలక సూచనలు
నిజామాబాద్: సంక్రాంతి సెలవులకు ఊరెళ్లే వారు దొంగతనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సూచించారు. నగలు, విలువైన వస్తువులను లాకర్లలో ఉంచాలని, ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వాడాలని కోరారు. తాము ఊరెళ్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని, ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చి వెళ్లాలని తెలిపారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 100కు ఫిర్యాదు చేయాలని, పోలీసులకు సహకరించి దొంగతనాల నివారణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు.