చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని శ్రీ విజయ సాయి ఉన్నత పాఠశాలలో ఈరోజు (ఆదివారం) ‘గ్రాండ్ పేరెంట్స్ డే’ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ జయ ప్రకాష్ నారాయణ మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం మార్కుల కోసమే కాకుండా, సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలని, చదివిన దానిని అర్థం చేసుకుని ఉన్నత విలువలతో ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. కృష్ణమోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో విద్యార్థులు తమ తాతయ్యలు, అమ్మమ్మలతో గడుపుతూ వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్, ఉపాధ్యాయ బృందం, పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు, తాతముత్తవ్వలు పాల్గొన్నారు.

