Explore

Search

November 7, 2026 6:07 pm

రుచుల విందు: ‘మహా బావాచి’ రెస్టారెంట్‌ను ప్రారంభించిన ఏసీపీ

చంటి ఛానల్,బోధన్: పట్టణ ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన  “మహా బావాచి ఫ్యామిలీ రెస్టారెంట్‌” ను బోధన్ ఏసీపీ శ్రీనివాస్ శనివారం ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి హోటల్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే ‘స్ప్రింగ్స్ బేకరీ’ ద్వారా తమ ప్రత్యేక రుచులతో బోధన్ ప్రజల మన్ననలు పొందిన యాజమాన్యం, ఇప్పుడు రెస్టారెంట్‌ను ప్రారంభించడం సంతోషకరమన్నారు. వినియోగదారుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మంచి భోజనాన్ని అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్.హెచ్.వో వెంకటనారాయణ, హోటల్ ప్రతినిధి అఫ్రోజ్ అలీ, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్