చంటి ఛానల్,నిజామాబాద్: మున్సిపల్ రిజర్వేషన్ల కేటాయింపులో బంజారాలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ బంజారా సంఘాల నాయకులు శనివారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిన ఉత్తర్వులను బేకాతరు చేస్తూ, కేవలం 7 శాతాన్నే పరిగణనలోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. ఈ అన్యాయంపై బంజారా ప్రజాప్రతినిధులు, నాయకులు స్పందించాలని కోరారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు ధారావత్ గోపాల్ నాయక్, రాథోడ్ శ్రీనివాస్ నాయక్, జాదవ్ ప్రవీణ్ నాయక్, కొర్ర బంతిలాల్ నాయక్, బర్మవత్ నరేష్ నాయక్ పాల్గొన్నారు.

