Explore

Search

November 7, 2026 6:32 pm

మున్సిపల్ బరిలో బీజేపీ అభ్యర్థులు: ఘనంగా బీ-ఫారాల పంపిణీ

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు సోమవారం అధికారికంగా బీ-ఫారాలను అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి పాల్గొని అభ్యర్థులకు ఫారాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గడ్డం నాగజ్యోతి, పెరిక పుష్పలత భార్గవి, దాల్ ముల్క రాములు, కొలిపాక రేణుక, కంది గట్ల శ్రీనివాస్, కృష్ణ వినోద్, మీర్జాపురం అరవింద్, కందిమళ్ల దుర్గాప్రసాద్, ఆసియా బేగం సురేఖ తదితరులు బి-ఫారాలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్