Explore

Search

November 7, 2026 7:08 pm

మజ్లిస్ నామినేషన్ రిజెక్ట్.. అధికారుల నిర్లక్ష్యమే కారణమా?

చంటి ఛానల్,బోధన్: పట్టణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మజ్లిస్ పార్టీ (AIMIM) టౌన్ ప్రెసిడెంట్ మిర్ అస్లీ నామినేషన్ ఫారమ్‌ను అధికారులు తిరస్కరించడంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయం తెలియగానే ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ తన అనుచరులతో కలిసి బోధన్ సబ్-కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని అధికారులను నిలదీశారు. మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యం వల్లే అన్ని పత్రాలు ఉన్నప్పటికీ నామినేషన్ రిజెక్ట్ అయిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మజ్లిస్ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సబ్-కలెక్టర్ వికాస్ మహతో, పూర్తి విచారణ జరిపి త్వరలోనే నామినేషన్‌ను అంగీకరిస్తామని హామీ ఇచ్చారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇవ్వడంతో ప్రస్తుతానికి పరిస్థితి సద్దుమణిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్