చంటి ఛానల్, బోధన్: తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు బోధన్ టౌన్–2 సెక్షన్ పరిధిలోని సాలూర, హుంసా గ్రామాల్లో విద్యుత్ శాఖ ‘ప్రజా బాట’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఏడీఈ కె. నగేష్‌కుమార్, ఏఈ కళ్యాణ్ వినియోగదారులు మరియు రైతుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని, కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యలకు త్వరలోనే అంచనాలు రూపొందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇకపై ప్రతి మంగళ, గురు, శనివారాల్లో గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుందని, విద్యుత్ సమస్యల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ పొదుపు, భద్రతా చర్యలపై అవగాహన కల్పించగా, విద్యుత్ సిబ్బందితో పాటు స్థానిక సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.

