Explore

Search

November 7, 2026 7:16 pm

​”బోధన్ కోటపై గులాబీ జెండా ఖాయం.. షకీల్ శపథం!”

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల సమరానికి బిఆర్ఎస్ శ్రేణులను సిద్ధం చేస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ లో నిర్వహించిన కీలక సమావేశంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిజామాబాద్ జిల్లా నేతలతో జరిగిన ఈ సమీక్షలో షకీల్ మాట్లాడుతూ.. ప్రత్యర్థులకు అవకాశం లేకుండా బోధన్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని, బోధన్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతామని, కేటీఆర్‌కు ఇచ్చిన మాట ప్రకారం బోధన్ పీఠాన్ని బిఆర్ఎస్ ఖాతాలో వేస్తామని ఆయన శపథం చేసినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్