చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల వేళ స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దశాబ్దాలుగా బీజేపీని నమ్ముకుని పార్టీ బలోపేతానికి కృషి చేసిన సీనియర్ నాయకులు, అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో కాంగ్రెస్ గూటికి చేరతారనే ప్రచారం పట్టణంలో పెను సంచలనంగా మారింది. తమ మనోభావాలను పార్టీ గౌరవించడం లేదన్న ఆవేదనతో ఉన్న ఈ నేతలు సామూహికంగా ‘హస్తం’ పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అయితే, ఈ పరిణామాలను గమనించిన బీజేపీ అధిష్టానం వెంటనే రంగంలోకి దిగి, అసంతృప్త నేతలతో చర్చలు జరిపి వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. పార్టీని వీడొద్దని, సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇస్తున్నప్పటికీ, సీనియర్లు ఈ బుజ్జగింపులకు లొంగి పార్టీలోనే కొనసాగుతారా లేక కమలానికి షాక్ ఇచ్చి కాంగ్రెస్‌లో చేరతారా అనేది ఇప్పుడు బోధన్ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.

