Explore

Search

November 7, 2026 6:32 pm

బిఆర్ఎస్‌కు షాక్: ఎంఐఎంలో చేరిన ‘ఏకే 47’ అబ్దుల్ రెహమాన్

చంటి ఛానల్, బోధన్: పట్టణ రాజకీయాల్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. బిఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యదర్శిగా, మాజీ ఎమ్మెల్యే షకీల్ ప్రధాన అనుచరుడిగా ఉంటూ ‘ఏకే 47’గా సుపరిచితుడైన అబ్దుల్ రెహమాన్ గురువారం ఆ పార్టీకి రాజీనామా చేసి ఎంఐఎం (MIM) తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లోని మలక్ పేట ఎమ్మెల్యే, నిజామాబాద్ ఎంఐఎం ఇన్చార్జ్ అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఎన్నో ఏళ్లుగా షకీల్ కుటుంబ సభ్యుడిలా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన రెహమాన్, ఒక్కసారిగా పార్టీ మారడం బోధన్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పట్టణంలో బలమైన పట్టున్న నాయకుడు వెళ్ళిపోవడం బిఆర్ఎస్‌కు ఏ మేరకు నష్టం చేకూరుస్తుందోనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్