Explore

Search

November 7, 2026 6:12 pm

ఫిబ్రవరి 05న ‘మహా రక్తదాన శిబిరం’ – ఆరోగ్య జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ పిలుపు.

చంటి ఛానల్,బోధన్: నిస్వార్థ సేవలో భాగంగా ఆరోగ్య జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ – బోధన్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీల అవసరాల కోసం ఫిబ్రవరి 05, 2026 గురువారం నాడు “మహా రక్తదాన శిబిరం” నిర్వహిస్తున్నారు. బోధన్, బాన్సువాడ, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే గర్భిణీలకు రక్తం కొరత లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బోధన్‌లోని గంజ్ రోడ్డులో గల ఆర్.టి.సి. కాలనీలో ఉదయం 07:30 గంటల నుండి ఈ శిబిరం ప్రారంభం కానుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని, తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ట్రస్ట్ నిర్వాహకులు జ్యోతి రాజు కోరారు. మరిన్ని వివరాల కోసం 9908401657, 9959263964 నంబర్లను సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్