చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని 1వ వార్డు గరీబ్ నవాజ్ కాలనీ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. పేరుకు తగ్గట్టే ఇక్కడ వ్యవస్థ అంతా ‘గరీబ్’గా మారిందని, కనీస రోడ్లు, డ్రైనేజీ సదుపాయం లేక నరకయాతన అనుభవిస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊరవతల ఉండటంతో వర్షాకాలంలో పాముల భయం, ఎండాకాలంలో నీటి ఎద్దడితో అడుగడుగునా భయం భయంగా జీవిస్తున్నామని, పాలకులు తమను పట్టించుకోవడమే మానేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వార్డ్ నెంబర్ వన్ అభ్యర్థులు నేరుగా కాలనీకి వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తేనే ఓట్లు వేస్తామని, లేదంటే పోలింగ్‌కు దూరంగా ఉంటామని కాలనీవాసులు ఖరాకండిగా తేల్చి చెబుతున్నారు.

