Explore

Search

November 7, 2026 6:12 pm

నేడు బోధన్‌లో ‘లయన్స్ జనరల్ దవాఖాన’ ప్రారంభోత్సవం: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

బోధన్, చంటి ఛానల్: పట్టణంలోని పేద ప్రజలకు తక్కువ ధరలో మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన ‘లయన్స్ జనరల్ దవాఖాన’ నేడు (ఈ నెల 23న) అందుబాటులోకి రానుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు  ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ ఆస్పత్రిని ప్రారంభించనున్నారు. 20 పడకల సామర్థ్యం, ఐసీయూ (ICU), 24 గంటల అత్యవసర సేవలతో ఏర్పాటు చేసిన ఈ దవాఖానలో కేవలం ₹100 కే ఓపీ (OP) సేవలు అందించడం విశేషం. ట్రస్ట్ సభ్యులు, వైద్య బృందం ఈ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్