Explore

Search

November 7, 2026 6:12 pm

నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌తో ఎన్నికల అబ్జర్వర్ భేటీ

చంటి ఛానల్,నిజామాబాద్: మున్సిపల్ ఎన్నికల జనరల్ అబ్జర్వర్, తెలంగాణ టెక్నాలజికల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్.సత్యనారాయణ రెడ్డి బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేసిన పారదర్శక ఏర్పాట్లను అబ్జర్వర్‌కు వివరించారు. కాగా, ఎన్నికలకు సంబంధించి ప్రజలు తమ ఫిర్యాదులు లేదా సూచనలను 95533 95000 ఫోన్ నెంబర్ ద్వారా లేదా mngdirector-tgts@telangana.gov.in మెయిల్ ఐడీ ద్వారా తెలియజేయవచ్చని సత్యనారాయణ రెడ్డి సూచించారు. ఈ భేటీలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, నోడల్ అధికారి సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్