చంటి ఛానల్ ,బోధన్: పట్టణంలోని సాయిబాబా కమాన్ వద్ద ప్రతిష్టించిన తెలంగాణ తల్లి విగ్రహం ప్రస్తుతం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. గత ప్రభుత్వ హయాంలో అట్టహాసంగా పాలాభిషేకాలు అందుకున్న ఈ విగ్రహం, నేడు కనీసం శుభ్రం చేసే నాథుడు లేక దుమ్ము ధూళితో నిండిపోయి దర్శనమివ్వడం పట్ల స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వైభవంగా వెలిగిన విగ్రహం, ఇప్పుడు కనీసం నీలాభిషేకానికి కూడా నోచుకోని దయనీయ స్థితికి చేరుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా స్థానిక నాయకులు, అధికారులు స్పందించి తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన ఈ విగ్రహాన్ని శుభ్రం చేయించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

