చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని 24వ వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దుర్గాప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. “గడపగడపకు బీజేపీ” నినాదంతో ప్రతి ఇంటిని సందర్శిస్తూ, ప్రజా మద్దతు కూడగట్టుకోవడంలో ఆయన దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. 24వ వార్డులో బీజేపీ జెండా ఎగురవేసే వరకు విశ్రమించబోనని భీష్మించుకున్నారు. ఓటర్లంతా ఆలోచించి కమలం పువ్వు గుర్తుకే ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అభ్యర్థికి మద్దతుగా స్థానిక ప్రజలు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చి స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొంటుండటంతో వార్డులో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.

