Explore

Search

November 7, 2026 6:22 pm

టౌన్ ప్రెసిడెంట్ vs కౌన్సిలర్.. ప్రచార సభలో ‘డాం డాం’ నినాదాలు!

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల వేళ బోధన్ పట్టణ ఎంఐఎం (MIM) పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. పార్టీ బలోపేతం కోసం నిర్వహిస్తున్న వార్డు స్థాయి బహిరంగ సభలు కాస్తా.. నేతల మధ్య ఆధిపత్య పోరుకు వేదికగా మారుతున్నాయి. తాజాగా జరిగిన ఒక స్టేజ్ ప్రోగ్రాంలో పార్టీ టౌన్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఒక కౌన్సిలర్ గౌరవానికి భంగం కలిగించేలా ఉండటంతో సీన్ రివర్స్ అయింది. ఆగ్రహానికి గురైన కౌన్సిలర్ అనుచరులు టౌన్ ప్రెసిడెంట్‌కు వ్యతిరేకంగా స్టేజ్ ముందే ‘డాం డాం’ అంటూ నినాదాలతో నిరసన తెలపడం పట్టణంలో కలకలం రేపింది. పరిస్థితి విషమించడంతో సదరు అధ్యక్షుడు తన మాటలను వెనక్కి తీసుకున్నప్పటికీ, కౌన్సిలర్ వర్గం పట్టువీడలేదు. చివరకు పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని సంజాయిషీ ఇవ్వడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. చైర్మన్ పీఠంపై కన్నేసిన తరుణంలో ఈ అంతర్గత కుమ్ములాటలు పార్టీకి గండంగా మారుతాయా అన్న చర్చ ఇప్పుడు బోధన్‌లో మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్