Explore

Search

November 7, 2026 6:58 pm

ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు: జెండా ఆవిష్కరించిన బీజేపీ పట్టణ అధ్యక్షుడు

చంటి ఛానల్,బోధన్: భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా రైల్వే గేట్ సమీపంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపి కిషన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహానుభావుల త్యాగాల ఫలితంగానే మనకు స్వతంత్రం సిద్ధించిందని, నేడు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఆర్థిక, వ్యవసాయ, రక్షణ రంగాల్లో అగ్రగామిగా దూసుకుపోతూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షులు కొలిపాక బాలారాజు, ప్రధాన కార్యదర్శి రాజులదేవి పవన్ కుమార్, BJYM అధ్యక్షులు ఏనుగంటి గౌతమ్ గౌడ్ మరియు పార్టీ నాయకులు పెరక వెంకటేష్, పప్పుల వేణు, కందికట్ల వాసు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్