Explore

Search

November 7, 2026 6:32 pm

గురుకులమా.. నరకమా? విద్యార్థినులపై టీచర్ ‘నీచ’ ప్రతాపం!

చంటి ఛానల్,బోధన్: బోధన్‌లోని టీజీఆర్‌ఎస్ & జూనియర్ కాలేజీ (బాలికలు)లో విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఒక ఉపాధ్యాయురాలు సంస్కారం మరిచి విద్యార్థినులపై పైశాచికంగా ప్రవర్తిస్తుండటం తీవ్ర దుమారం రేపుతోంది. ఒక పీజీటీ ఇంగ్లీష్ టీచర్ 10వ తరగతి, ఇంటర్ విద్యార్థినులను “కుక్క జాతి, బర్రె జాతి, సిగ్గులేని మంద” అంటూ అత్యంత నీచమైన పదజాలంతో దూషిస్తూ, తోటి సిబ్బంది ముందే వారి ఆత్మగౌరవాన్ని కాలరాస్తూ మానసిక హింసకు గురిచేస్తోంది. ఈ వికృత వేధింపులు భరించలేక కన్నీటి పర్యంతమైన విద్యార్థినులు రోడ్డెక్కి నిరసన తెలపడానికి ప్రయత్నించగా, యాజమాన్యం గేట్లు వేసి వారి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. విద్యార్థినుల మనోస్థితిని దెబ్బతీస్తూ, వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్న సదరు ‘అజ్ఞాన’ ఉపాధ్యాయురాలిని తక్షణమే డిస్మిస్ చేయాలని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని విద్యార్థి లోకం గర్జిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్