Explore

Search

November 7, 2026 6:07 pm

గడ్డపై ‘పతంగి’ జోరు: మున్సిపల్ పీఠం మాదే – అసదుద్దీన్ ఓవైసీ ధీమా

చంటి ఛానల్,బోధన్: పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పర్యటనతో పట్టణం ఒక్కసారిగా వేడెక్కింది. వార్డు వార్డునా కాలినడకన తిరుగుతూ, ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్న ఓవైసీ.. ఎంఐఎం అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాము పోటీ చేస్తున్న 24 వార్డుల్లోనూ మజ్లిస్ జెండా ఎగరడం ఖాయమని, ఈసారి బోధన్ మున్సిపల్ చైర్మన్ కుర్చీని తమ పార్టీయే కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలో దారుణంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, అధ్వాన్నపు రోడ్ల పరిస్థితిని స్వయంగా చూశానని, అధికారంలోకి రాగానే ఈ సమస్యలన్నింటినీ సమూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వందలాది మంది కార్యకర్తలు, మద్దతుదారుల నినాదాలతో బోధన్ వీధులన్నీ మారుమోగిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్