Explore

Search

November 7, 2026 6:22 pm

క్రెసెంట్ హైస్కూల్‌లో ఘనంగా ‘మెగా క్విజ్ 2025-26’

 

చంటి ఛానల్, బోధన్: క్రెసెంట్ హైస్కూల్ వేదికగా జరిగిన ‘ఇంట్రా స్కూల్ మెగా క్విజ్ 2025-26’ పోటీలకు ముఖ్య అతిథిగా బోధన్ PWD డెప్యూటీ ఈఈ సి.రామ్ మోహన్ హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం ఎంతో స్ఫూర్తిని నింపింది. ఈ సందర్భంగా ఆయన అడిగిన క్లిష్టమైన ప్రశ్నలకు విద్యార్థులు అద్భుతమైన సమాధానాలు ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. పదవ తరగతి విద్యార్థులు రాబోయే తుది విడత క్విజ్ పోటీల్లో ప్రతిభ చాటాలని కోరుకుంటూ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీర్ జావిద్ అలీ, ముఖ్య అతిథిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. రామ్ మోహన్ రాకతో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్