చంటి ఛానల్,బోధన్: పురపాలక ఎన్నికల నేపథ్యంలో అధికారులు పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 111 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు 8 మంది జోనల్ ఆఫీసర్లు (మరో ఇద్దరు రిజర్వ్), 13 మంది రిటర్నింగ్ అధికారులు (ముగ్గురు రిజర్వ్), 13 మంది సహాయ రిటర్నింగ్ అధికారులను (ముగ్గురు రిజర్వ్) నియమించారు. క్షేత్రస్థాయిలో విధులను నిర్వహించేందుకు 155 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు (P.O), 155 మంది సహాయ ప్రిసైడింగ్ ఆఫీసర్లు (A.P.O) అందుబాటులో ఉండగా, వీరిలో ప్రతి విభాగం నుండి 44 మందిని రిజర్వ్‌లో ఉంచారు. అలాగే రిజర్వ్ సిబ్బందితో కలిపి మొత్తం 310 మంది ఇతర పోలింగ్ ఆఫీసర్లు (O.P.O) ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఎటువంటి ఆటంకాలు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.

