Explore

Search

November 7, 2026 6:22 pm

ఎంఐఎం మద్దతుతో మున్సిపల్ పీఠం కైవసం చేసుకోనున్న కాంగ్రెస్!

చంటి ఛానల్ ,బోధన్: మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. సోమవారం ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, ఆపై మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. తాజా సమాచారం ప్రకారం, కాంగ్రెస్, ఎంఐఎం (MIM) పార్టీలు పొత్తుతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోబోతున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా చైర్మన్ పదవి కాంగ్రెస్ అభ్యర్థికి, వైస్ చైర్మన్ పదవి ఎంఐఎం పార్టీకి కేటాయించినట్లు తెలుస్తోంది. చైర్మన్ అభ్యర్థి ఎవరనేది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించాల్సి ఉండగా, వైస్ చైర్మన్ పీఠం మాత్రం ఎంఐఎం అభ్యర్థి ఇలియాస్ కే దక్కుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్