Explore

Search

November 7, 2026 6:12 pm

ఉచిత చక్కెర వ్యాధి నిర్ధారణ శిబిరం విజయవంతం

చంటి ఛానల్,బోధన్: ఆరోగ్య జ్యోతి చారిటబుల్ ట్రస్ట్, వాకర్స్ అసోసియేషన్ – బోధన్ ఆధ్వర్యంలో, ఆర్.టి.సి కాలనీ వాసుల సహకారంతో నిర్వహించిన ఉచిత షుగర్ టెస్ట్ క్యాంప్ ఈరోజు (ఆదివారం) ఉదయం అత్యంత విజయవంతంగా ముగిసింది. ఐవీపాత్ (IVYPATH) డయాగ్నోస్టిక్ సెంటర్ వారి సాంకేతిక సహకారంతో స్థానిక జ్యోతి నిలయంలో జరిగిన ఈ శిబిరంలో అనేకమంది ప్రజలు పాల్గొని రక్త పరీక్షలు చేయించుకున్నారు. నిర్వాహకులు ఫాస్టింగ్,పోస్ట్-లంచ్ రక్త నమూనాలను సేకరించి ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్ష చేయించుకోవడానికి వచ్చిన వారందరికీ టిఫిన్స్ ఏర్పాటు చేయడం విశేషం. ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ కౌన్సిలర్ సత్యం, నరేందర్, నవీన్,బుజ్జి, ప్రసాద్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్