Explore

Search

November 7, 2026 6:22 pm

ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను ఆహ్వానించిన నిజామాబాద్ జిల్లా పెఱిక సంఘం నాయకులు

చంటి ఛానల్,తెలంగాణ: పెఱిక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, పెఱిక కుల ముద్దుబిడ్డ పాయల్ శంకర్ గారిని సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి, జనవరి 19న జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మైదం రాజన్న, ప్రధాన కార్యదర్శి అల్లే రమేష్‌లతో పాటు నాయకులు కుంచాల రాజు, మాజీ ఎంపీపీ సత్యనారాయణ, సర్పంచ్ అరుణ్ కుమార్, సిహెచ్. గంగారం, ఈ. రమేష్, గంగారెడ్డి, చిన్న రాజన్న మరియు వివిధ హోదాల్లో ఉన్న ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సంఘం బలోపేతానికి ఎమ్మెల్యే తమ సంపూర్ణ మద్దతునిస్తారని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్