చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన మెరుపు దాడుల్లో భారీగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపార అవసరాలకు వాడుతున్నారన్న సమాచారంతో, ఎన్ఫోర్స్మెంట్ డీటీ హనుమంతు నేతృత్వంలోని బృందం పలు హోటళ్లు, బేకరీలపై దాడులు చేసింది. ముఖ్యంగా ‘దీపక్ స్వీట్ హోమ్’లో నిర్వహించిన తనిఖీల్లో 15 సిలిండర్లను, మరో ప్రాంతంలో 3 సిలిండర్లను సీజ్ చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా అధికారులు హెచ్చరిస్తూ, గృహ అవసరాల గ్యాస్‌ను వ్యాపారాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని, పట్టణంలో గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు.

