చంటి ఛానల్,బోధన్: తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (IPE) 2026 ఫలితాల్లో బోధన్‌లోని విద్యా వికాస్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి ఘన విజయం సాధించారు. ముఖ్యంగా బైపిసి (BIPC) విభాగంలో తహూరా తమ్సిల్ 1000కి 994 మార్కులు, అరిషా సమీన్ 992 మార్కులు సాధించి కళాశాల కీర్తిని చాటారు. ఎంపిసి (MPC) విభాగంలో కె. సాత్విక 990 మార్కులతో టాపర్‌గా నిలవగా, ఎం. మహేశ్వరి (985), ఎ. వసంత్ (984), జాన్ వాన్యా (984), ఎం. శ్రీకర్ (982), ఎం. సోమనాథ్ (980)లు అత్యుత్తమ మార్కులు సాధించారు. అలాగే ఎంఈసీ విభాగంలో ఫైజా నూరిన్ (931), సీఈసీ విభాగంలో లాడ్కే కుశాల్ (949) విశేష ప్రతిభ కనబరిచారు. విద్యార్థుల ఈ అసాధారణ విజయానికి కళాశాల డైరెక్టర్ వై. అనంతలక్ష్మి, ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు.

