Explore

Search

November 7, 2026 6:07 pm

ఓవర్‌లోడ్ వాహనాలపై రవాణా శాఖ కొరడా: బోధన్‌లో తనిఖీలు, 3 కేసులు నమోదు

చంటి ఛానల్,నిజామాబాద్: రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (DTC) దుర్గా ప్రమీల ఆదేశాల మేరకు, జిల్లా రవాణా అధికారి (DTO) రమేష్ రాథోడ్ పర్యవేక్షణలో బోధన్ పరిధిలో ఓవర్‌లోడ్ వాహనాలపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 3 కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో బోధన్ MVI అశ్వంత్ కుమార్, AMVI మణికాంత్, రవాణా శాఖ కానిస్టేబుల్ ప్రశాంత్, హోంగార్డ్ హరినాయక్ పాల్గొన్నారు. ఇసుక, గ్రానైట్, గ్రావెల్, సిమెంట్ వంటి ఖనిజాలను పరిమితికి మించి తరలించే వాహనాలపై రాబోయే రోజుల్లోనూ ఈ ప్రత్యేక తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై మోటార్ వాహనాల చట్టం (MV Act) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్