Explore

Search

November 7, 2026 6:45 pm

‘దొంగ ఎండీల’ దందా: పైన తెల్ల కోటు.. మెడలో స్టెతస్కోపు.. వెనుక మాత్రం అసలు రంగు!”

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలో నకిలీ డాక్టర్లు ‘ఎండీ’ల అవతారమెత్తి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కనీస అర్హతగానీ, స్పెషలైజేషన్ డిగ్రీలుగానీ లేకపోయినా, తాము పెద్ద పెద్ద స్పెషలిస్టులమంటూ బోర్డులు తగిలించుకుని రోగులను నిలువునా ముంచుతున్నారు. తెల్లకోటు వేసి స్టెతస్కోప్ తగిలిస్తే చాలు మేమే మేధావులమని భ్రమింపజేస్తూ, సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (DMHO) అధికారులు మాత్రం ‘మామూళ్ల’ మాయలో పడి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు కేవలం నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతుండటంతో ఈ దొంగ ఎండీల ఆటలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయి. ఇప్పటికైనా యంత్రాంగం నిద్రవీడి ఈ నకిలీ వైద్యుల అడ్డాలపై ఉక్కుపాదం మోపకపోతే, అమాయక ప్రజల ప్రాణాలు బలికాక తప్పదని మేధావులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్