Explore

Search

November 7, 2026 6:45 pm

అమ్మ వెంటే కొడుకు.. అనాథగా మిగిలిన అంధ సోదరి!

చంటి ఛానల్,నిజామాబాద్: కంటిరెప్పలా చూసుకునే అమ్మ (పద్మిని బాయి, 60) అనారోగ్యంతో కన్నుమూయగా, ఆ కన్నపేగు బంధాన్ని తెంచుకోలేక కొడుకు (సునీల్ దేవ్, 35) కూడా ఆత్మహత్య చేసుకుని అమ్మ వెంటే కాటికి నడిచాడు. ఒకే చితిపై అమ్మ, అన్నల అంత్యక్రియలు జరుగుతుంటే ఆ ఊరంతా కన్నీరుమున్నీరైంది. అయితే, కన్నవారి చివరి చూపును కూడా కళ్లారా చూడలేని ఒక అంధ సోదరి (స్వప్న) ఇప్పుడు పూర్తిగా ఒంటరిదై, అనాథగా మిగిలిపోయింది. “నన్ను చూడటానికి మీరు లేరు.. మిమ్మల్ని చూడటానికి నాకు కళ్లు లేవు” అంటూ ఆ చెల్లెలు ఏడుస్తున్న తీరు రాతి గుండెలను సైతం పిండేస్తోంది. విధి ఆడిన ఈ దారుణ నాటకంలో ఆ అంధురాలి భవిష్యత్తు ఇప్పుడు చీకటిమయమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్