Explore

Search

November 7, 2026 6:23 pm

చంటి ఛానల్ ఎఫెక్ట్: రిలయన్స్ మార్ట్ సెల్లార్ ఫుల్.. రోడ్డుపై ట్రాఫిక్ నిల్!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణం కొత్త బస్టాండ్ వద్ద రిలయన్స్ స్మార్ట్ పార్కింగ్ వల్ల ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యపై ‘చంటి ఛానల్’ ప్రసారం చేసిన కథనం సూపర్ హిట్ అయ్యింది. గతంలో అధికారులు సూచించినా మారని పరిస్థితి, చంటి ఛానల్ కథనంతో ఒక్కసారిగా మారిపోయింది. దీనిపై హైదరాబాద్‌కు చెందిన రిలయన్స్ స్మార్ట్ మేనేజర్లు సానుకూలంగా స్పందించి, తక్షణమే ఇద్దరు సిబ్బందిని కేటాయించి వాహనాలన్నీ సెల్లార్‌లోనే పార్క్ చేసేలా చర్యలు చేపట్టారు. గత రెండు రోజులుగా సెల్లార్ పూర్తిగా నిండుతుండటంతో రహదారిపై ట్రాఫిక్ కష్టాలు తీరాయి. ప్రజా సమస్యను వెలుగులోకి తెచ్చి పరిష్కారం చూపిన చంటి ఛానల్ కు ప్రజాసంఘాల నాయకులు,పట్టణ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్