తెలంగాణలో పాఠశాలల వేసవి సెలవులను ప్రభుత్వం జూన్ 15 వరకు పొడిగించింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జూన్ 12న స్కూళ్లు తెరవాల్సి ఉండగా, ఆ వెంటనే రెండో శనివారం, ఆదివారం సెలవులు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ సెలవులకు ప్రత్యామ్నాయంగా జులై 11న వచ్చే రెండో శనివారాన్ని పని దినంగా (వర్కింగ్ డే) పరిగణిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది.

