చంటి ఛానల్,బోధన్: కాంగ్రెస్ పార్టీ బోధన్ మండల అధ్యక్షులుగా నాగేశ్వర రావు వరుసగా మూడవసారి నియమితులయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీర భద్రరావ్, ధనుంజేయరెడ్డి, సలీం, సాయి కిరణ్ ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ మేరకు నాగేశ్వర రావుకు వారు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఈ సందర్భంగా నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

