చంటి ఛానల్,బోధన్: దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం బోధన్ పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్‌లో గల లీగల్ అసిస్టెంట్ సెంటర్లో నివాళులర్పించారు. పద్మా సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమె సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. మహిళా విద్య కోసం, సమాజ అభ్యున్నతి కోసం ఆమె చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లోల శంకర్, రాజేందర్ సింగ్, సుజాత, 15వ వార్డు నాయకులు గుమ్ముల అశోక్ రెడ్డి, న్యాయ సహాయక కేంద్ర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

