చంటి ఛానల్, బోధన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సామాజిక సేవలో విశేష కృషి చేస్తున్న సరోజినీ , ఆరోగ్య జ్యోతి , డాక్టర్ పద్మ తో పాటు పలువురు మహిళామణులను అసోసియేషన్ సభ్యులు ఈ సందర్భంగా గౌరవించి సన్మానించారు. సమాజ సేవలో, ఆరోగ్య రంగంలో మహిళలు చూపుతున్న చొరవ అభినందనీయమని, వారు అందరికీ స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా నిర్వాహకులు కొనియాడారు.

