చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ డిపో నుండి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రైవేట్ డ్రైవర్లు అరాచకానికి తెరలేపారు. బస్సును మార్గమధ్యంలోనే ఆపి, టికెట్ డబ్బులు ఇస్తేనే ముందుకు తీసుకెళ్తామని ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తూ పురుషుల వద్ద నుండి బలవంతంగా నగదు, ఫోన్ పే ద్వారా వసూళ్లకు పాల్పడ్డారు. బహిరంగంగా సాగుతున్న ఈ దోపిడీపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ నిబంధనలను తుంగలో తొక్కి సామాన్యులను ఇబ్బంది పెడుతున్న సదరు ప్రైవేట్ డ్రైవర్లపై డిపో మేనేజర్, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

