Explore

Search

November 7, 2026 6:07 pm

బోధన్‌లో డివిజన్ స్థాయి సహకార సంఘాల సమీక్ష

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ రైతు వేదికలో జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో ఎఫ్‌పీఓలుగా ఎంపికైన 05 సంఘాల భవిష్యత్ కార్యాచరణ, ఎరువుల కొరత లేకుండా చూడాల్సిన చర్యల గురించి ప్రధానంగా చర్చించారు. నానో యూరియా, నానో డీఏపీ వాడకంతో పాటు, ఎల్ నీనో వాతావరణ మార్పుల దృష్ట్యా పంట మార్పిడిపై రైతుల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత సహకార సంఘాలపై ఉందని అధికారులు సూచించారు.ఈ సమావేశంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్లు రవీందర్, రమావతి, పోషన్న, సీనియర్ ఇన్స్పెక్టర్లు అరుణ్, పుష్ప, రియాజ్, శంకర్, అలీ లతో పాటు డివిజన్ స్థాయి సహకార సంఘ కార్యదర్శులు శ్రీనివాస్ చారీ, బాబా, హన్మంత్ రావు, సంజీవ్, హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్