చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని అత్యంత ప్రాచీనమైన ఇంద్రనారాయణ స్వామి ఆలయాన్ని అసాంఘిక శక్తుల బారి నుంచి రక్షించి, తిరిగి ప్రారంభించాలని కోరుతూ స్థానిక వాసి కె. సాయి ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్‌కు బుధవారం (జూన్ 3, 2026) ఒక వినతిపత్రం సమర్పించారు..
చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన ఈ 100 స్తంభాల గుడి ప్రాంగణంలో ధూమపానం, మద్యం సేవించడం, పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని ఆయన తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు..
ఈ చర్యల వల్ల వారసత్వ కట్టడమైన ఆలయ పవిత్రత దెబ్బతినడమే కాకుండా, చాలా వరకు స్తంభాలు ధ్వంసమయ్యాయని, మరికొన్ని అదృశ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు..
తక్షణమే స్థానిక అధికారుల సమన్వయంతో ఆలయ భూమిని, స్తంభాలను పరిరక్షించి, పురావస్తు సర్వే నిర్వహించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఈ చారిత్రక సంపదను అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

