Explore

Search

November 7, 2026 6:11 pm

పేదరికం చదువుకు అడ్డుకాకూడదు: ఉచిత ఇంటర్ విద్యను అందిస్తున్న రుద్ర ఫౌండేషన్

చంటి ఛానల్,నిజామాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రుద్ర ఫౌండేషన్, ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత ఇంటర్మీడియట్ విద్యను అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పల్లెంపాటి నవీన్ నేతృత్వంలోని ఈ సంస్థ, నిజామాబాద్, కామారెడ్డి, మరియు మెదక్ జిల్లాలకు చెందిన విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తోంది. 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారు, అలాగే అనాథలు లేదా ఒంటరి తల్లిదండ్రులు ఉన్న పేద విద్యార్థులు దీనికి అర్హులు. ఫౌండేషన్ నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. POLYCET, TSRJC వంటి పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. గత నాలుగేళ్లలో 70 మందికి పైగా విద్యార్థులను NITలు, మెడికల్ కాలేజీల వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చేర్చిన ఈ ఫౌండేషన్ సాయం కోరువారు rudhrafoundation2022@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్