చంటి ఛానల్,నిజామాబాద్: సాలూర మండలం జాడి జమాల్‌పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం సాక్షిగా పాత రాజకీయ కక్షలు మళ్లీ భగ్గుమన్నాయి! బుధవారం సాలూర తహసీల్దార్ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ఓ రోడ్డు విషయమై బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వార్డు సభ్యుల మధ్య రేగిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది..
గ్రామసభ ముగిసిన తర్వాత కూడా ఇరువర్గాలు పంచాయతీ భవనంలోనే కయ్యానికి కాలుదువ్వుతూ రెచ్చిపోవడంతో.. గత సర్పంచ్ ఎన్నికల నాటి వాగ్వాదాలు, పోలీసు కేసుల వాతావరణం మరోసారి కళ్లకు కట్టింది..
అయితే, నాయకులు పదే పదే ఇలా రాజకీయ విభేదాలతో రచ్చకెక్కితే ప్రగతి ఏమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు.. కక్షలు, పార్టీల పట్టింపులు పక్కనపెట్టి సమిష్టిగా జాడి జమాల్‌పూర్ అభివృద్ధి కోసం నాయకులంతా కలసికట్టుగా ముందుకు సాగాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

