Explore

Search

November 7, 2026 6:12 pm

సివిల్ వివాదాలతో పోలీసులకు సంబంధం లేదు: సీఐ వెంకటనారాయణ

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలో ఒక పత్రికలో తనపై వచ్చిన ఆరోపణలను సీఐ వెంకటనారాయణ ఎస్.హెచ్.వో తీవ్రంగా ఖండించారు. తన ప్లాటు వివాదంలో సీఐ పట్టించుకోవడం లేదని, పైగా తనను బెదిరిస్తున్నారని జయ అనే మహిళ ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ పత్రికలో వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఆ మహిళ చెబుతున్న సమస్య పూర్తిగా ఆస్తికి సంబంధించిన సివిల్ వివాదమని, ఆ ఇష్యూ ఇప్పటికే కోర్టులో నడుస్తోందని ఆయన వివరించారు. ఇటువంటి సివిల్ వ్యవహారాల్లో పోలీసుల పాత్ర ఏమీ ఉండదని, కోర్టు ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని మాత్రమే ఫిర్యాదురాలికి సూచించామని తెలిపారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, ఫిర్యాదులను పట్టించుకోకపోవడం లేదా ఉద్దేశపూర్వకంగా బెదిరించడం లాంటివి జరగలేదన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు సందేశాలను వైరల్ చేసినట్లయితే, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ వెంకటనారాయణ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్