Explore

Search

November 7, 2026 6:12 pm

​”గురుకుల విద్యార్థినుల ప్రాణాలతో చెలగాటం: ఆటోల్లో గొర్రెల్లా తరలిస్తున్న ప్రిన్సిపాల్!”

చంటి ఛానల్,బోధన్: గురుకుల కళాశాల విద్యార్థినుల భద్రత గాలిలో దీపంలా మారింది. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు వెళ్తున్న సుమారు 150 మంది విద్యార్థినులను కేవలం రెండు ఆటో వ్యాన్లలోనే కుక్కి తరలిస్తుండటం ప్రిన్సిపాల్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఫస్ట్ ఇయర్‌లో 86 మంది, సెకండ్ ఇయర్‌లో 63 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరవుతుంటే, ఒక్కో ఆటోలో పరిమితికి మించి 18 నుండి 20 మందిని ఎక్కించి అత్యంత వేగంగా పరీక్షా కేంద్రానికి తీసుకెళ్తున్నారు. ఒకవైపు పరీక్షల ఒత్తిడి, మరోవైపు ప్రాణసంకటంగా మారిన ప్రయాణం విద్యార్థినులను బెంబేలెత్తిస్తోంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏవైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరు? విద్యాశాఖనా లేక కళాశాల యాజమాన్యమా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థినుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, సురక్షితమైన బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ వెల్లువెత్తుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్