చంటి ఛానల్,బోధన్: స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ యందు శనివారం రోజున ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS), బోధన్ వారి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ అధ్యక్షులు చీల శంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో PCC డెలిగేట్ గంగా శంకర్, మాజీ CDC అధ్యక్షులు పోతారెడ్డి, సంఘ మాజీ అధ్యక్షులు ఉద్మీర్ లక్ష్మణ్, బండారు పల్లి సర్పంచ్ కాడే సాయిలు, మావంది ఖుర్దూ సర్పంచ్ శ్రీరామ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ బండారి సంజీవ్, వార్డు కౌన్సిలర్ రవి మరియు ప్రముఖులు దాము, పాషా, నాగేశ్వర్ రావు, కర్నె భూమన్న, సంజీవ్ రెడ్డి, నాగభూషణం పాల్గొన్నారు. వీరితో పాటు బోధన్ క్లస్టర్ AEO శ్యామల, సంఘ కార్యదర్శి ఉమాకాంత్, సిబ్బంది, రైతులు పాల్గొని, ప్రభుత్వం కల్పించే మద్దతు ధరను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

