Explore

Search

November 7, 2026 5:57 pm

వత్సల చదువుకు ‘మేముసైతం’ రూ.7,000 ఆర్థిక సాయం

చంటి ఛానల్,ఆదిలాబాద్ : పేదరికం వల్ల పీజీ ఫీజు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న ఇంద్రవెల్లి మండలం అంజి గ్రామానికి చెందిన వత్సల అనే విద్యార్థినికి ‘మేముసైతం’ స్వచ్ఛంద సేవా సంస్థ అండగా నిలిచింది. ఆమె పరిస్థితిని తెలుసుకున్న సంస్థ చైర్మన్ డాక్టర్ నవీన్ కుమార్ గైని స్పందించి రూ. 7,000/- ఆర్థిక సాయం అందజేశారు. భవిష్యత్తులోనూ ఆమె చదువుకు తమ సహకారం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థిని సంస్థకు కృతజ్ఞతలు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్