చంటి ఛానల్, సాలూర: మండల కేంద్రంలోని వాగ్దేవి ప్రైమరీ పాఠశాలలో ఉగాది పండుగ వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులకు పండుగ విశిష్టతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగువారు ఉగాదిని నూతన సంవత్సరంగా ఎందుకు జరుపుకుంటారో విద్యార్థులకు వివరించారు. ముఖ్యంగా ఉగాది పచ్చడిలోని షడ్రుచుల ప్రాముఖ్యతను తెలుపుతూ, జీవితంలో ఎదురయ్యే విజయాలను, అపజయాలను, కష్టసుఖాలను సమానంగా స్వీకరించడమే నిజమైన మనిషి లక్షణమని ఆయన ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

