Explore

Search

November 7, 2026 6:12 pm

పాత్రికేయుడు రాజలాల్ కుమార్తె నిశ్చితార్థం: వధూవరులకు ప్రకాష్ రెడ్డి శుభాకాంక్షలు

చంటి ఛానల్,బోధన్: పట్టణానికి చెందిన ప్రముఖ పాత్రికేయులు రాజలాల్ కుమార్తె నందిని,సాయినాథ్‌ల నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈరోజు వారి నివాసానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి విచ్చేసి, కాబోయే నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి వారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ రెడ్డి తో పాటు బీజేపీ పట్టణ అధ్యక్షులు గోపి కిషన్, ఎడపల్లి మండల అధ్యక్షులు ఇంద్రకరణ్,పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొని సందడి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్